ఆచార్య ప్లే అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో ఘనంగా బోనాల ఉత్సవాలు

August 5, 2026 | తెలంగాణ

బిచ్కుంద ఆగస్టు 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా, బిచ్కుంద పట్టణంలోని `ఆచార్య ప్లే అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్` లో మంగళవారం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ బోనాల ఉత్సవ వేడుకలు నిర్వహించారు. ఆషాఢంలో జరిగే బోనాల విశిష్టతను ప్రిన్సిపాల్ పి.జ్ఞానేశ్వర్ వివరించారు. “బోనం” అనే పదం “భోజనం” అనే పదం నుండి వచ్చిందని, అమ్మవారికి బెల్లం అన్నం, బోనం నైవేద్యంలో ఉన్న ఆయుర్వేద వేపాకు సైంటిఫిక్ విశిష్టతను వివరించారు. పోతురాజు, అమ్మవారి, వివిధ వేషధారణలలో విద్యార్థులు పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.

🌐 Select Language:
📰 ePaper