కొణతాల గోపాల కి ఘనమైన నివాళులు

August 5, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ఆగస్టు 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ :తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ చైర్మన్ జగన్నాథ స్వామి దేవాలయం కొణతాల గోపాల్ మొదటి వర్ధంతి సందర్భంగా జగన్నాథ స్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల వెంకటరావు కాండ్రేగుల సత్యనారాయణ సాలాపు నాయుడు పిలా సత్య గిరి తదితరులు గోపాల్ చిత్రపటానికి పుష్పాలు అక్షింతలు సమర్పించి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటరావు సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి గోపాల్ అంకితభావంతో నిబద్ధత తో ఏ పని అప్పగించిన బాధ్యతగా పనిచేసేవారని, వార్డ్ అధ్యక్షులుగా, శ్రీ శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానానికి చైర్మన్ గా పనిచేసే భక్తులు ప్రజలు మనల్ని పొందారని రథయాత్ర, ఇంద్రజామహల్ లో స్వామి వారి కార్యక్రమాల్ని, భారీ అన్న సమారాధన, రథయాత్రలో ఎటువంటి గొడవలు లేకుండా అన్ని వర్గాలుతో శాంతియుతంగా పూర్తిచేసిన ఘనత కూడా గోపాల్ కి దక్కుతుందని వెంకటరావు సత్యనారాయణ అన్నారు./

🌐 Select Language:
📰 ePaper