బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

August 5, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ఆగస్టు 05: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం:మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బుధవారం ఏర్గట్ల మండలంలో పర్యటించి పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సోమ రాజారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ సోమ గంగారెడ్డి తండ్రి సోమ చిన్న గంగారం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే నాగేంద్రనగర్‌కు చెందిన గుండు కార్తీక్ తండ్రి గంగాధర్ మృతి పట్ల కూడా విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కుటుంబ పెద్దలను కోల్పోవడం తీరని లోటని, బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper