ప్రజావాణి ఫలితం: నిషేధిత జాబితా నుండి భూమి తొలగింపు – మహిళ రైతుకు తక్షణ న్యాయం

August 5, 2026 | తెలంగాణ

కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపిన రైతు

మద్నూర్ ఆగస్టు 5 జనం న్యూస్ ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఒక రైతు మహిళ జీవితంలో వెలుగు నింపింది.మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామానికి చెందిన కట్మోడే చంద్రకళ భూమి నిషేధిత జాబితాలో ఉండటం వల్ల బ్యాంకు లోను రావడం లేదని సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ కి ఆన్లైన్ లో నేరుగా ఫిర్యాదు చేశారు.జిల్లా కేంద్రానికి 110 కి.మీ దూరం వెళ్లలేని పరిస్థితుల కారణంగా, మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం నుండే అంతర్జాల వేదిక ద్వారా నేరుగా కలెక్టర్ దృష్టికి తన సమస్యను తీసుకువచ్చారు.తక్షణ చర్యసమస్యను విన్న వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించారు. దరఖాస్తుదారు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని, నిషేధిత జాబితా నుండి చంద్రకళ భూమిని నేడే తొలగించామని సంబంధిత మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ కి తెలియజేశారు.ఈ విషయం దరఖాస్తుదారుకు తెలియజేయడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తన సమస్య త్వరగా పరిష్కారమైనందుకు జిల్లా కలెక్టర్ కి, బాన్సువాడ RDOకి, మద్నూర్ తహసీల్దార్ కి కృతజ్ఞతలు తెలిపారు.దూర ప్రయాణం చేయకుండానే మండల స్థాయిలోనే సమస్య పరిష్కారం కావడంతో ప్రజావాణి విధానాన్ని గ్రామస్తులు అభినందించారు.

🌐 Select Language:
📰 ePaper