తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి ….

August 6, 2026 | తెలంగాణ

బిచ్కుంద ఆగస్టు 6 జనం న్యూస్ జీవితాంతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి బిచ్కుంద మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ సీమా సెట్ కార్ ఘన నివాళులు అర్పించారు,ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావానికి ఆచార్య జయశంకర్ గారి ఆలోచనలు, సిద్ధాంతాలు, త్యాగం చిరస్మరణీయమని, భావితరాలకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు మునిసిపల్ కమిషనర్ షేక్ హయూమ్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్, కౌన్సిలర్ నౌషా నాయక్ కౌన్సిలర్ గంగాధర్ మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper