ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోనాల పండుగ:- డాక్టర్ ఎన్ చందన, ప్రిన్సిపాల్.

August 7, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతిగా బోనాల పండుగ ఉంటుందని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ చందన, ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వెంకటయ్య లు అన్నారు. గురువారం కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో బోనాల పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా బోనాల పండుగను జరుపుకుంటామని వారు తెలిపారు. బోనాల పండుగ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు అధ్యాపకులు బోనాలు ఎత్తుకొని ఆటపాటలతో సందడి చేస్తూ సంబరాలలో మునిగి తేలుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్, డిగ్రీ కళాశాలలకు చెందిన అధ్యాపకులు అందరూ పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper