హనుమాన్ నగర్ లో ఘనంగా బోనాల పండుగ.శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలు
జనం న్యూస్ ఆగస్టు 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బోనాల పండుగను పురస్కరించుకుని కూకట్పల్లి హనుమాన్ నగర్ కాలనీలోని శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించనున్నారు. అభిషేకం చేయించాలనుకునే భక్తులు ముందుగా ఆలయ నిర్వాహకులకు తమ వివరాలను తెలియజేయాలని కోరారు.అనంతరం ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.