బీజేపీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
జనం న్యూస్ 08 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ;పెరుగుతున్న ధరలు జీఎస్టీ భారాలను తగ్గించాలి దేశ సంపదను బడా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం ఆపాలి సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు మల్లకల్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు పిలుపునిచ్చారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని జీఎస్టీ భారాలను తగ్గించాలని దేశ సంపదను బడా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.సిపిఐ మండల కార్యదర్శిఎల్కూరు రంగన్న ఆధ్వర్యంలో మల్లకల్లు మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం నుంచి పాత బస్టాండ్ మీదుగా ఎద్దులగూడెం వరకు పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై ధరల భారాన్ని మోపుతూ కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికుల హక్కులను దెబ్బతీసే విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జీఎస్టీ పేరుతో సామాన్యులపై అదనపు భారం మోపడం సరికాదన్నారు.
ఒకవైపు సామాన్య ప్రజలపై ధరలు పన్నుల భారాలను మోపుతూ మరోవైపు దేశ సంపదను బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని ఆంజనేయులు ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలు, దేశ సహజ వనరులను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దేశ సంపద ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కార్మికులకు హక్కుల రక్షణ, యువతకు ఉద్యోగాలు ప్రజలకు అందుబాటులో నాణ్యమైన విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు ధరల పెరుగుదలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరిచి సిపిఐ ఆధ్వర్యంలో మరింత విస్తృతంగా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ పాదయాత్రకు సిపిఐ మండల కార్యదర్శి ఎల్కూరు రంగన్న నాయకత్వం వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాటికుంట వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆశన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భారత్, ప్రవీణ్ అంబేద్కర్ హమాలీ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు భీమన్న, రాజు తిమ్మప్ప విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు సురేందర్ఎఐటియుసి నాయకులు రత్నం తిమ్మప్ప రామాంజనే యులు రాముడు జమ్మన్న అయ్యన్న ఇతర సిపిఐ నాయకులు, హమాలీ కార్మికులు సిపిఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఉద్యమాభి వందనములతో జి రంగన్నసిపిఐ మండల కార్యదర్శి మల్దకల్ మండలం
జోగులాంబ గద్వాల జి