బోధి పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ

August 8, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ; 8 ఆగస్టు శనివారం సిద్దిపేట నియోజక వర్గ ఇంచార్జి వై.రమేష్ ;బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పోతరాజుల వేషధారణలో, విద్యార్థినులు బోనాలు ఎత్తుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు.పోతరాజుల వేషధారణలో అనూక్, అయాన్, అభిజయ్, విశ్వకర్మ పాల్గొనగా, బోనాలు ఎత్తుకున్న వారిలో తనుశ్రీ, ఐశ్వర్య, శ్రీవల్లి, అవంతిక, ఆరుషి, అద్వైత తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పడిగే భాస్కర్, డైరెక్టర్ మల్లిక మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కలుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు శ్రీలత, దివ్య, మౌనిక, స్రవంతి, కాశీప, సల్మా పర్వీన్, సౌజన్య, మల్లిక తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper