గేదెల్లంక గ్రామదేవత లంక తల్లమ్మ – శ్రీ లక్ష్మీదుర్గ అమ్మవార్లకు సారె సమర్పణ.

August 8, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ఆగస్టు 8 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో వేంచేసియున్న గ్రామ దేవత శ్రీ లంకతలమ్మ అమ్మవారికి మరియు శ్రీ లక్ష్మీదుర్గ అమ్మవార్లకు లలితా పారాయణ బృందం ఆధ్వర్యంలో మాతృమూర్తులు గ్రామస్థులు అమ్మవార్లను తమ ఆడపడుచులుగా భావిస్తూ పసుపు కుంకుమ గాజులు పువ్వులు పండ్లు చీర రవిక స్వీట్లు తీసుకుని పెద్ద సంఖ్యలో మాతృమూర్తులు గ్రామస్థులు మేళ తాళాలతో గ్రామోత్సవముగా అమ్మ నామాన్ని పలుకుతూ ఆలయం చేరుకొని అమ్మవారికి పసుపు నీళ్ళు సమర్పించి విశేష పూజలు నిర్వహించి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ బి కనకారావు పాల్గొని ఈ విధమైన కార్యక్రమాల వలన హిందువుల్లో ఐక్యత పెరిగి స్నేహభావం పెరుగుతుందన్నారు. గ్రామ వికాస్ జిల్లా కార్యకర్త బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలతోపాటు దేవాలయ కేంద్రముగా వారం వారం భజన సత్సంగం హారతి తరచూ నిర్వహించడం వలన అందరిలోనూ ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయన్నారు. వీటి ఆధారంగా మన భావితరాలకు మన ఆచార సాంప్రదాయాలను పరిచయం చేస్తూ మన ధర్మాన్ని కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఇరు ఆలయ కమిటీ సభ్యులు యూత్ సభ్యులు మాతృమూర్తులు ఆడపడుచులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

🌐 Select Language:
📰 ePaper