శారద హైస్కూల్లో ఘనంగా బోనాల పండుగ

August 9, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : ఆగస్టు 9, ఆదివారం: సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి వై. రమేష్; సిద్దిపేట జిల్లా శారద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో తెలంగాణ సంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు పోతరాజుల వేషధారణలో, విద్యార్థినులు బోనాలు ఎత్తుకొని సంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాల్ శారద ,జీవిత , లలిత, సౌజన్య, రవి స్వామి, డాన్స్ మాస్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో బోనాల పండుగ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

🌐 Select Language:
📰 ePaper