తెలంగాణ ‘అన్నప్రసాదనైవేద్యం’ బోనం   –అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం

August 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ;10 ఆగస్టు సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ :బోనాల పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు ‘బోనంనైవేద్యం’క్యాన్వాస్ చిత్రాన్ని చిత్రించి అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. మాట్లాడుతూ అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తు పండుగలు సమాజలను, సంస్కృతిని కళావంతం చేస్తాయని, బోనాలపండుగ తెలంగాణ రాష్ట్ర పండుగ అస్తిత్వం, అని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నలుదిశలా వ్యాపింప జేస్తుందని అన్నారు . ప్రజలు, కలలుగన్న బంగారు తెలంగాణ జాతీ పండుగ బోనాలు పర్వదినం అధిగమిస్తోందంని కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ సుభిక్షం కావాలని, ఐక్యమత్యం సహజీవనం సుఖ సంతోషాలు పెంపొందించాలని తెలంగాణ బోనాల పండుగ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని సౌభ్రాతృత్వం అందించాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు. ఆర్ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారులు నహీంరుస్తుం, అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబినారుస్తుం, రహీం, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper