తిల్లకుప్ప గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ తిళ్ళాలమ్మ కు సారే సమర్పణ

August 11, 2026 | ఆంధ్రప్రదేశ్

జన జ్యూస్ ఆగస్టు 11 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ) ఐ పోలవరం మండలం తిళ్ళకుప్ప గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ తిల్లాలమ్మను గ్రామ ఆడపడుచుగా భావిస్తూ గ్రామంలో ఏ విధమైన దుష్టశక్తులు ప్రవేశించకుండా కాపాడుతూ పాడిపంటలను వృద్ధి వృద్ధి చేస్తూ తమ పిల్లాపాపలను కాపాడుతూ అష్టైశ్వర్యాలను కలగజేస్తూ ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి పుట్టింటి వారిగా పిలవబడుతున్న మెండా వారి కుటుంబం అత్తింటి వారిగా పిలవబడుతున్న పల్లవారి కుటుంబం తరపున అమ్మవారికి ఆషాడంసారె సమర్పించిరి. శ్రీసిద్ధి వినాయక ఆలయం నుండి మరియు శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం నుండి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు మాతృమూర్తులు విద్యార్థులు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పువ్వులు పండ్లు చలివిడి పానకం తదితర మంగళ ద్రవ్యములతో బాణసంచా కాలుస్తూ మంగళ వాయిద్యములతో దేవాలయం చేరుకుని ముందుగా అమ్మవారికి పసుపు నీళ్లు సమర్పించి నారు తదుపరి ధర్మ ప్రచారక్ బి కనకారావు అమ్మవారికి కుంకుమార్చన పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించుగా భక్తులు తీసుకువచ్చిన సారెను అమ్మవారికి సమర్పించి శాకాంబరీ దేవిగా అలంకరించిన అమ్మవారిని చూసి పులకిస్తూ ఆనందమయంతో జైజై ద్వానాలు చేస్తూ కమిటీ వారు ఏర్పాటుచేసిన అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించినారు.కడియం తమ్మయ్య మెండా సత్యనారాయణ పల్ల సత్యనారాయణమూర్తి ఆరవ వెంకటేష్ ( శ్రీను )తోటకూర బాబులురాజు కొప్పిశెట్టి వీరంశెట్టి ఉద్ధిశ గోపి మోత సోమేశ్ ఉందుర్తి దాసు రాచకొండ అచ్చిబాబు శీలం వెంకట్రావు గుత్తుల భద్ర రావు గొలగాబత్తుల వెంకటేశ్వరరావు శీలం మురళి యాళ్ల జేజేలు కర్నేడి బాబి కడియం చినవెంకటేశ్వరరావు పెన్నాడ ఆదినారాయణ పెన్నాడ సుబ్బలక్ష్మి పెరాబత్తుల రామకృష్ణారావు అధిక సంఖ్యలో భక్తులు మాతృమూర్తులు యూత్ కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

🌐 Select Language:
📰 ePaper