అమ్మవారి బోనాల జాతరలో పాల్గొన్న శ్రీ బండి రమేష్

August 11, 2026 | తెలంగాణ

కూకట్‌పల్లి, ఆగస్టు 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : శ్రీశ్రీశ్రీ తలుపులమ్మ తల్లి నీలమణి దుర్గమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన అమ్మవారి బోనాల జాతర కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం సమర్పించి ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయు రారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రత్యేక ప్రతీక అని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సంతోషం, ఆరోగ్యం కలగాలని బండి రమేష్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో ప్రశాంతి నగర్ డివిజన్ ప్రెసిడెంట్ చందర్రావు, నాగార్జున, గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, వాసు, రమణ, పాల్గొన రావు, కామినేని వాసు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper