ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ టవర్స్ కు భూమిపూజ:బండి రమేష్
జనం న్యూస్ ఆగస్టు 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : పేదల సొంతింటి కల సాకారానికి శిలాఫలకం పడబోతోంది. కె.పి.హెచ్.బి 7,9, ఫేజ్ మరియు గోకుల్ ప్లాట్స్ మధ్యలో ఉన్న 5.87 ఎకరాల స్థలంలో పేదలకోసం 43 కోట్ల ఖర్చుతో నాలుగు టవర్లను నిర్మించనున్నారు. అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో నిర్మించబోయే ఈ టవర్ల కు రేపు(గురువారం) మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించనున్నారు. ఒక ఏడాదిలో పూర్తి చేయాలని తలపెట్టిన ఈ ప్రాజెక్టు లో ఫేజ్ 1 కింద 480,ఫేజ్ 2 కింద 680 ఇళ్ళు నిర్మించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను టీపీసీసీ ఉపాధ్యక్షులు,కూకట్పల్లి పార్టీ ఇంచార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ పర్యవేక్షించి, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఇది మన నియోజకవర్గంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని,పేదవారి సొంతింటి కల సాకారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని,పారదర్శకంగా ఇళ్ళు కేటాయింపు ప్రక్రియ ఉంటుందని రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలి బాలాజీ, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, శ్రీనివాస బాబు,అరవింద్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, నాగార్జున, కొప్పిశెట్టి దినేష్ కుమార్, మాకినేని వినోద్ , రంగమోహన్, చావా శ్రీనివాస్, గంధం రాజు, ప్రవీణ్, అప్పారావు, మైకేల్, కాజా నవీన్, మేకల మహేష్, మగదం, తదితరులు పాల్గొన్నారు.