క్లస్టర్ స్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు

August 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన ర్యాలీ మండలంలో క్లస్టర్ స్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు వరిపంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు క్లస్టర్ స్థాయిలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు మండలం లోని పెద్దకోడెపాక కొత్తగట్టు సింగారం ప్రగతి సింగారం గ్రామంలో ఈ ర్యాలీలు నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని ఆధ్వర్యంలో రైతులకు పలు సూచనలు చేశారు. ఎల్‌ ని నో ప్రభావం నేపథ్యంలో పంటల వైవిధ్యీకరణ.ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండటంతో పాటు, వరుస వర్షాల మధ్య ఎక్కువ విరామం ఉండే అవకాశం ఉన్నందున రైతులు పూర్తిగా వరిపైనే ఆధారపడకుండా ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.వరి పంటకు ప్రత్యామ్నాయంగా కంది, పెసర, మినుము, అలసంద వంటి పప్పుధాన్యాలు, నూనెగింజలు, జొన్న, రాగి, కొర్ర వంటి చిరుధాన్యాలను సాగు చేసుకోవాలని తెలిపారు. రసంపీల్చే పురుగుల నివారణకు తక్కువ ఖర్చు పద్ధతులువర్షాల మధ్య ఎక్కువ విరామం ఏర్పడినప్పుడు రసంపీల్చే పురుగుల ఉధృతి పెరిగి పంటలకు నష్టం కలిగే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ ఖర్చుతో కూడిన సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు.ముఖ్యంగా బెండను ఎర పంటగా సాగు చేయడంతో పాటు, అవసరమైన చోట తెలుపు, నీలం రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు 7 రకాల వరి విత్తనాల వివరాల నమోదు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, ప్రైవేట్ రైతుల వద్ద నుంచి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు లేదా సొంత విత్తనంతో 7 సూచించిన వరి రకాలను సాగు చేస్తున్న రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ (పిపిబి) నంబర్ విత్తన బిల్లులు ఉన్నట్లయితే వాటితో సంబంధిత ఎ ఇ ఓ లను సంప్రదించి వివరాలను నమోదు.చేయించుకోవాలని తెలియజేశారుఆగస్టు 20 నుంచి ఎరువుల విక్రయానికి సెంట్రల్ యాప్ ఫ్రేమ్‌వర్క్ఆగస్టు 20, 2026 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎరువుల విక్రయానికి సెంట్రల్ యాప్ ఫ్రేమ్‌వర్క్ అమల్లోకి రానుందని వ్యవసాయ అధికారి ప్రియదర్శిని తెలిపారు. ఈ విధానంలో ఫార్మర్ ఐడి కీలక మైనందున, ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్టరీ పూర్తి చేసుకోని రైతులు వెంటనే సంబంధిత ఎ ఇ ఓ లను సంప్రదించి ఆగస్టు 20లోగా. ఫార్మర్ రిజిస్టర్మరీ పూర్తి చేసుకోవాలని తెలిపారురైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ చేపట్టి, నీటి వినియోగం సాగు వ్యయాన్ని తగ్గించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దకోడెపాక క్లస్టర్ ఏ ఈ ఓ అన్వేష్ కొత్తగట్టు సింగారం క్లస్టర్ ఏ ఈ ఓ అక్షర ప్రగతి సింగారం ఏ ఈ ఓ సానియా గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు…

🌐 Select Language:
📰 ePaper