ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

August 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్, ఆగష్టు 15,అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురం ఎమ్మార్వో కార్యాలయం, విశాఖ పబ్లిక్ స్కూల్ నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper