మెట్టుపల్లి వాసులకు అంతర్జాతీయ ఎక్సలెన్స్ అవార్డులు

August 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్ఆగస్టు 14: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం:స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మెట్టుపల్లికి చెందిన నలుగురికి ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డులు లభించాయి.వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు స్టేట్ డైరెక్టర్ మాలేపు నారాయణకు సామాజిక సేవా విభాగంలో, డాక్టర్ శ్రీరాముల నారాయణస్వామికి సామాజిక సేవా విభాగంలో, ఏనుగుందుల వేణుగోపాల్కు విద్యా రంగంలో సేవలకు, వాసాల వినయ్కు ఉత్తమ ప్రేరణాత్మక వక్త మరియు నాయకత్వ ప్రతిభకు అవార్డులు అందజేశారు.హైదరాబాద్‌లోని కింగ్‌కోఠిలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ చేతుల మీదుగా అవార్డులు అందజేసి నలుగురిని ఘనంగా సన్మానించారు. వివిధ రంగాల్లో సేవలందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మెట్టుపల్లి వాసులను పలువురు అభినందించారు

🌐 Select Language:
📰 ePaper