లయన్స్ క్లబ్ సిద్దిపేట ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరం
జనం న్యూస్: 14 ఆగస్టు శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ వై. రమేష్ :లయన్స్ క్లబ్ సిద్దిపేట ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట పాత బస్టాండ్ సమీపంలో ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో షుగర్‌తో బాధపడుతున్న వారికి ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు లగిశెట్టి నరసింహులు మాట్లాడుతూ, “ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే మనమంతా బాగుంటాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, ఎప్పటికప్పుడు షుగర్, బీపీ పరీక్షలు చేయించుకోవాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి శ్రీనివాస్, జెడ్సి దాసరిపల్లి, జో జి సత్యనారాయణ, రాజ్ బహదూర్ తదితరులు పాల్గొన్నారు.