పేదలకు అల్పాహార వితరణ
నాగిరెడ్డిపల్లి, తేదీ 14. 8.2026 : లయన్స్ మరియు వాకర్స్ క్లబ్స్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వాహకులు మన్నెం రామమోహన్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అరవపల్లి ఆర్ అండ్ బి బంగ్లా ఆవరణమునందు పేదలకు అల్పాహార వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వృద్ధులు, మహిళలు పాల్గొని అల్పాహారం స్వీకరించ డ మైనది.అన్నదానం పుణ్య కార్యమని అనాధలకు, వృద్ధులకు ఆకలి తీర్చటం ఎంతో తృప్తినిచ్చే కార్యక్రమమని ఇటువంటి పేదలకు సహాయం చేసే కార్యక్రమాలకు పలువురు ముందుకు రావాలని స్వచ్ఛందంగా వారికి తోచిన సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి తోడ్పాటు గా ఉండాలని ఎస్సై మన్నెం రామ్మోహన్ గారు తెలియ జేశారు.ఈ కార్య క్రమంలో డాక్టర్ బచ్చు జయభాస్కరరావు, లయన్ కుర్రా మణి యాదవ్ , భూశెట్టి వెంకటసుబ్బయ్య నీటి సంఘం అధ్యక్షులు, మోడ పోతుల రాము, గంధం గంగాధర్, మంటి మారయ్య, ముమ్మడిశెట్టి రమేష్, గురు ప్రసాద్,కారకుర్తి వెంకటయ్య, కొత్తపల్లి రాజా చారి, గుండు సురేష్, సునీల్ రెడ్డి, చామంచి పెంచలయ్య, మట్టి బాబు, మన్నెం దేవి, మన్నెం చరణ్ పలువురు పాల్గొనడం జరిగింది