ఉత్తమ విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన దాతలు

August 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జెడ్పి హెచ్ ఎస్ బాలుర బాలికల పాఠశాలలో 2025.26 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలలో అధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం దాతలు నగదు బహుమతులను అందజేసినారు. జెడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాలలో మొదటి బహుమతిగా కీర్తిశేషులు బాసాని శంకరయ్య జ్ఞాపకార్ధంగా కుమారులు 5000 రూపాయలను బాసాని నిఖిల్ కు ప్రధమ బహుమతిగా బాసాని సుబ్రహ్మణ్యం అందజేశారు ద్వితీయ బహుమతిగా దిడ్డి సాంబయ్య జ్ఞాపకార్ధంగా వారి కుమారులు దిడ్డి రమేష్ ప్రభాకర్ లు బోయిన శశిధర్ కు 4000 రూపాయలను అందజేశారు తృతీయ బహుమతిగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కీర్తిశేషులు సామల వీరేశం జ్ఞాపకార్థంగా వారి కుమారుడు శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సామల బిక్షపతి దుర్ఘుణాల చరణ్ కు 3000 రూపాయలను అందజేశారు. అలాగే జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో కీర్తిశేషులు బాసాని సుదర్శనం జ్ఞాపకార్థం వారి కుమార్తెలు ప్రథమ బహుమతిగా బాసాని అన్విత కు 5000 రూపాయలను బాసాని సుబ్రహ్మణ్యం అందజేశారు ద్వితీయ బహుమతి దిడ్డి సాంబయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారులు దిడ్డి రమేష్ ప్రభాకర్ శివరాత్రి దీవెన కు 4000 రూపాయలు అందజేశారు తృతీయ బహుమతిగా కీర్తిశేషురాలు సామల రాధమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సామల బిక్షపతి ఎండీ రేష్మ కు 3000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్లు అడికీ చర్ల జనార్ధన్ శ్రీలత స్థానిక సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ చేనేత సహకార సంఘం అధ్యక్షులు బాసాని ప్రకాష్ డైరెక్టర్ బాసాని నవీన్ ఉపాధ్యాయులు గుండు సదానందం పద్మ రాజబాబు సత్యప్రసాద్ వంశీ శ్రీనివాస్ రాజిరెడ్డి శేఖర్ బాబు రేణుక సుజాత లక్ష్మీబాయి రంజిత్ కుమార్ కుమారస్వామి గీత విజయలక్ష్మి రాజేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు..

🌐 Select Language:
📰 ePaper