శాయంపేట గ్రామ లో మొదలైన పోచమ్మ తల్లి బోనాలు

August 17, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో శ్రావణమాసం మొదటి ఆదివారం రోజున అతి పురాతనమైన పోచమ్మ తల్లికి సాంప్రదాయ పద్ధతిలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం విశ్వకర్మలు ముందుగా బోనాలు సమర్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విశ్వకర్మలు వాళ్ల కుటుంబాలు పిల్ల పాపలతో నైవేద్యాలు వండుకుని అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు ఘనంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మొదటి ఆదివారం బోనాలు సమర్పించుచున్నామని ఊరి ప్రజలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లేలా ఆ తల్లిని చూడమని వేడుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాయంపేట గ్రామంలోని విశ్వకర్మలకు సంబంధించిన కుల బాంధవులు మహిళలు మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.

🌐 Select Language:
📰 ePaper