గద్వాల రోడ్లపై చెరువులు మున్సిపాలిటీకి కనువిప్పు ఎప్పుడో
జనం న్యూస్ 20 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గద్వాల పట్టణంలోని రోడ్ల దుస్థితి చూస్తే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు మున్సిపాలిటీ ఉందా పాలకవర్గం అధికారులు ఉన్నారా అనే ప్రశ్నలు వాహనదారులు స్థానిక ప్రజల నుంచి వినిపిస్తున్నాయి పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ సమీపంలోని రాయచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై నిన్న కురిసిన స్వల్ప వర్షానికే భారీగా నీరు నిలిచి చిన్న చెరువును తలపిస్తోంది ఈ మార్గం మీదుగా ప్రతిరోజూ వందలాది వాహనాలు వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటా. రోడ్డుపై నిలిచిన నీటితో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారుచిన్న వర్షానికే రోడ్డుపై చెరువు ఏర్పడితే ఇక భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడానికి కారణమైన డ్రైనేజీ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మున్సిపాలిటీపై ఉందని వారు అంటున్నారు.ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రోడ్లపై నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. సమస్య కళ్లముందే కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోకపోతే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలన్న ప్రశ్న తలెత్తుతోంది.ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి రాఘవేంద్ర కాలనీ సమీపంలోని రాయచూర్ రహదారిపై నిలిచే నీటికి శాశ్వత పరిష్కారం చూపాలి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు లేకుండా సురక్షితంగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలి ఈ సమస్యపై మున్సిపాలిటీకి కనువిప్పు ఎప్పుడు వస్తుందో వేచి చూద్దాం