సంతోషిమాత రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనఖీ
* రూ. కోట్ల విలువైన 8,078 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం మాయం* * విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీల్లో దారుణం వెలుగులోకి..* * * సివిల్ సప్లైస్ డీఎం ఫిర్యాదుతో రైస్ మిల్ యాజమాన్యంపై కేసునమోదు
జనం న్యూస్ ఆగస్టు 22మండలం పెన్ పహడ్ :ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ నిమిత్తం అప్పగించిన కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఒక భారీ కుంభకోణం పెన్ పహాడ్ మండలంలో వెలుగుచూసింది. సివిల్ సప్లైస్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి, ప్రభుత్వ నమ్మకాన్ని వమ్ము చేసిన శ్రీ సంతోషిమాత బిన్నీ రైస్ మిల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అధికారుల మెరుపు తనిఖీలతో ఈ అక్రమాల గుట్టు రట్టయింది. **రైస్ మిల్లులో విజిలెన్స్, సివిల్ సప్లైస్ అధికారుల జంట దాడులు:* రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ (నల్గొండ యూనిట్ ఆఫీస్) అధికారులు, సివిల్ సప్లైస్ శాఖాధికారులతో కలిసి మాచారం గ్రామ శివారులో ఉన్న ‘శ్రీ సంతోషిమాత బిన్నీ రైస్ మిల్’ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మిల్లులోని రికార్డులను పరిశీలించి, భౌతికంగా ఉన్న ధాన్యం నిల్వలను లెక్కించగా అధికారులకు నిజాలు సాక్ష్యాధారాలతో సహా దొరికాయి. మూడు వేర్వేరు సీజన్లకు సంబంధించి ప్రభుత్వం మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యంలో ఏకంగా **8,078.818 మెట్రిక్ టన్నుల** ధాన్యం కొరత ఉన్నట్లు, అంటే మిల్లు నుండి మాయమైనట్లు తనిఖీల్లో పక్కాగా రుజువైంది. వెత్యాసం * **ఖరీఫ్ 2024-25 సీజన్:** 1,931.746 మెట్రిక్ టన్నులు.* **రబీ 2025-26 సీజన్:** 4,277.458 మెట్రిక్ టన్నులు.* **రబీ 2022-23 సీజన్:** 1,869.614 మెట్రిక్ టన్నులు.* **మొత్తం కొరత:** 8,078.818 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి కస్టమ్ మిల్డ్ రైస్ సరఫరా చేయకుండా, అప్పగించిన ధాన్య నిల్వలను అక్రమంగా విక్రయించుకుని ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొట్టిన రైస్ మిల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీజీస్కస్పీల్ సూర్యాపేట జిల్లా మేనేజర్ ఉప్పల శ్రీధర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సబ్ ఇన్స్పెక్టర్ బాలు నాయక్ తక్షణమే స్పందిస్తూ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.