పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి
జనం న్యూస్ 25 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పాలిటెక్నిక్ విద్యకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి టిఆర్పి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్ జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి కొమ్ముల ప్రవీణ్ రాజ్ సందర్శించి పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కొమ్ముల ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపంగా మారుతున్న జీవో 97ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక విద్యా వ్యవస్థగా కొనసాగించాలని కోరారు. అవసరమైతే ఇంటర్మీడియట్ బోర్డు తరహాలో పాలిటెక్నిక్ విద్యకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 97ను తక్షణమే రద్దు చేయకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.అనంతరం జోగులాంబ గద్వాల జిల్లా టిఆర్పి వర్కింగ్ ప్రెసిడెంట్ సిందనూరు గంగాధర్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. జీవో 97ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం జోగులాంబ గద్వాల జిల్లా టిఆర్పి ప్రధాన కార్యదర్శి కేసారం సిద్దు నాయుడు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య ద్వారా విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ఇలాంటి కీలకమైన విద్యా వ్యవస్థ విషయంలో ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకోవాలని కోరారు. జీవో 97ను తక్షణమే రద్దు చేసి, అవసరమైతే పాలిటెక్నిక్ విద్యకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.పాలిటెక్నిక్ విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. జీవో 97 రద్దు చేసే వరకు విద్యార్థులకు అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా ఇన్‌చార్జి రాముడు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు మోజేష్,అయిజ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ ప్రభాకర్, కృష్ణ తిరుమలేష్, సర్వేర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.