షోయబుల్లాఖాన్ ఆలేరు ప్రెస్ క్లబ్ గా నామకరణం

August 25, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 25 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు ప్రెస్ క్లబ్‌కు ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, నిర్భయ పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ పేరు పెట్టారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్‌ను షోయబుల్లాఖాన్ ప్రెస్ క్లబ్”గా నామకరణం చేశారు. పాత్రికేయ రంగానికి, ప్రజాస్వామ్య విలువలకు షోయబుల్లాఖాన్ చేసిన సేవలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అక్షరమే ఆయుధంగా పోరాటం షోయబుల్లాఖాన్ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలను తన కలంతో ధైర్యంగా ఎండగట్టిన పాత్రికేయుడు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావాలని బలంగా వాదిస్తూ తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఆయన ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ దినపత్రికకు సంపాదకుడిగా పనిచేస్తూ నిజాం ప్రభుత్వ విధానాలను, రజాకార్ల దమనకాండను విమర్శిస్తూ అనేక కథనాలు, సంపాదకీయాలు రాశారు. ఆయన రచనల కారణంగా గతంలో పనిచేసిన పత్రికలు కూడా ప్రభుత్వ ఆంక్షలకు గురయ్యాయి.షోయబుల్లా ఖాన్ పేరును ఆలేరు ప్రెస్ క్లబ్‌కు పెట్టడం ద్వారా ప్రజల పక్షాన నిలిచే జర్నలిజం, నిజాన్ని నిర్భయంగా చెప్పే పాత్రికేయ విలువలను కొనసాగించాలనే సంకల్పాన్ని చాటినట్లయింది. పాల్గొన్నవారు ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుర్షిత్ పాషా కార్యదర్శి జంపాల దశరథ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper