జనసేన నాయకులు బూత్ నెంబర్ 231 ఇంటింటి ప్రచారం- మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాండ్రేగుల జగ్గారావు
జనం న్యూస్ ఆగస్టు 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమం విజయాలు 81 వ వార్డులో బూత్ నెంబర్ 231లో ఇంటింటి ప్రచార మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనసేన నాయకులు కాండ్రేగుల జగ్గారావు ఈరోజు ఉదయం ఇంటింటి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి 31 వ రోజున రెడ్డి ఆదినారాయణ స్ట్రీట్ కరెంట్ ఆఫీస్ రోడ్డు దాడి భోగలింగం నాయుడు స్ట్రీట్ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఈ రెండేళ్ల కాలంలో సాధించిన ప్రగతిని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి సాధించిన పాంప్లెట్ ను వారికి అందించి గతంలోకి ఏంటి ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్, గర్భిణీ స్త్రీలకు అదనపు వార్డులు, కార్పొరేటు హాస్పిటల్ కి మించి అన్ని రకాల వైద్యులను నియమించి రోజుకి 2000 మంది అనకాపల్లి జిల్లా నుండి వచ్చి అనారోగ్యంతో ఉన్నవారు వైద్యం పొందుతున్నారని, అతి తక్కువ ధరకే మందులు కూడా హాస్పిటల్ లోనే జనరిక్ ద్వారా ఇస్తున్నారని జగ్గారావు తెలిపారు. అలాగే మార్కెట్ యార్డ్ పరిధిలో అనకాపల్లి ప్రజలు ఎప్పటినుండో చూస్తున్న రైతు బజార్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ నిబంధన ప్రకారం రైతులు పండించిన కాయగూరలు అతి తక్కువ ధరకు లభించే విధంగా శాసనసభ్యులు రామకృష్ణ ఏర్పాటు చేశారని, అలాగే మార్కెట్ యార్డులో వాకర్స్ కోరిక మేరకు నడక రహదారులు గ్రావెల్ ఏర్పాటు చేసి వాకర్స్ కి సహకరించారని, మార్కెట్ యార్డ్ కు అనుకొని రైతులు భూములు భూ సేకరణతో కూడా తీసుకొని రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా అభివృద్ధి చేయకుండా ఏళ్ల తరబడి దీర్ఘకాలంగా ఉన్న సమస్యని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో శాసనసభ్యులు మాట్లాడి రైతులు సమస్యలు పరిష్కరించారని త్వరలోనే విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు రోడ్లు ఏర్పాటు చేసి రైతులతో అంగీకరం చేసుకున్న ప్రకారం వారికి ప్లాట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతారని మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాండ్రేగుల జగ్గారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డి రవి దాడి కోటేశ్వరరావు గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి తదితరులు పాల్గొన్నారు.