నందలూరులో వైభవంగా మీలాద్-ఉన్-నబీ జులూస్ & రక్తదాన శిబిరం

August 26, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరులో మీలాద్-ఉన్- నబీ సందర్భాన్ని పురస్కరించు కుని నిర్వహించిన జులూస్ మరియు భారీ రక్తదాన కార్య క్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా పూర్తయిందని ఆస్తానే-ఏ-మఖ్దూమ్ రజ్వీ (నందలూరు) చిన్న పీఠాధిపతి, గవర్నమెంట్ గెజిట్ ఖాజీ సయ్యద్ మొయినుద్దీన్ హుస్సేనీ సాహెబ్ తెలిపారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో జులూస్ నిర్వ హించడమే కాకుండా, సమాజసేవలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. మానవాళికి సేవ చేయడమే ప్రవక్త అందించిన గొప్ప సందే శమని, ఈ రక్తదానంలో పాల్గొని ప్రాణదాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినం దించారు.​ఈ కార్యక్రమం విజయ వంతం కావడానికి పూర్తి సహ కారం అందించిన నందలూరు ఆటో యూనియన్ సభ్యులు, నందలూరు యువత కు, నందలూరు మండల పోలీస్ అధికారులకు, నందలూరు మండల ప్రభుత్వ వైద్యశాల అధికారులకు కడప రిమ్స్ వైద్య సిబ్బందికి రాజంపేట వైద్య సిబ్బందికి, రక్తదాతలకు, వాలంటీర్లకు మరియు స్థానిక ప్రజలకు సయ్యద్ మొయినుద్దీన్ హుస్సేనీ సాహెబ్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.అల్లాహ్ అందరి సేవలను స్వీకరించి ఆయు రారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.​మహమ్మద్ ప్రవక్త దివ్య దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటూ, ప్రజలందరికీ మీలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper