నలంద స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని సిద్ది పేట లోని నలంద విద్యాలయం లో కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. 100 మందికి పైగా విద్యార్థులు వేషధారణలతో పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జి.హరినాథ్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జీవితం, ఆయన బోధించిన ధర్మం, సత్యం, కర్తవ్యనిష్ఠ వంటి విలువలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పండుగల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను చిన్నారులకు పరిచయం చేయడం ఎంతో అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.