గన్నవరంలో టీడీపీ జిల్లా నాయకుల సుడిగాలి పర్యటన

September 6, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ సెప్టెంబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, మోక ఆనంద్ సాగర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. పి.గన్నవరం, అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో పర్యటించి స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమ పురోగతిని పరిశీలించారు. డోర్ టు డోర్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ నెల 9వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం గ్రామస్థాయి నుంచి సమన్వయంతో సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

🌐 Select Language:
📰 ePaper