పల్లెపాలెం అంబేద్కర్ నగర్ లో శ్రీ సీతారామాలయ ప్రతిష్ట.
జనం న్యూస్ సెప్టెంబర్ ఆరు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం పంచాయతీ పల్లెపాలెం అంబేద్కర్ నగర్ లో శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా నిర్మించిన శ్రీ సీతారామ ఆలయంలో హిందూ ధర్మ ప్రచార సమితి అమలాపురం (శ్రీనివాస శర్మ గారి) ఆర్థిక సహకారముతో కాల్దారి వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠా కార్యక్రమం ఉచితంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు పాల్గొని సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆర్థిక సహకారంతో గతంలో సమరసత సేవా ఫౌండేషన్ ఎస్సీ ఎస్టీ మత్స్యకార గ్రామాలలో అనేక దేవాలయాలు నిర్మించి ఆ కులం వారికే అర్చక శిక్షణ ఇచ్చి ఆ దేవాలయంలో పూజారిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరూ స్వామి సేవ చేసుకునే విధంగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా ఇప్పుడు మన గ్రామంలో నిర్మించుకున్న ఈ దేవాలయంలో వారం వారం భజన ప్రతి పౌర్ణమి రోజున సామూహిక హారతి నెలకు ఒకసారి సత్సంగము అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం వలన మనమందరము స్వామివారి కరుణాకటాక్షములతో సుభిక్షంగా ఉంటామని మన గ్రామం సుభిక్షంగా ఉంటుందనిమన ధర్మం సనాతన ధర్మం మనందరికీ రాముడు ఆదర్శ పురుషుడు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఎ రిటైర్డ్ సైంటిస్ట్ కాశి బాలకృష్ణ వడ్డీ శేఖర్ బాబు లక్ష్మీసుమతి గ్రంధి నానాజీ చిక్కాల బాబులు మట్ట సత్తిబాబు గాలిదేవర బుల్లి పొత్తూరి సత్యనారాయణరాజు కమిటీ వారు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి అన్న ప్రసాదం స్వీకరించారు.
