మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

May 21, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి దివంగత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కూకట్పల్లి నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి ఉపాధ్యక్షుడు తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కెపిహెచ్బి కాలనీ మలేషియా టౌన్షిప్ సర్కిల్లోను బాలనగర్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి రమేష్ స్థానిక నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను ఆయన కొనియాడారు. దేశంలో ముందుగా సంస్కరణల రంగంలో, ఐటి సెక్టార్లో విప్లవాత్మక మార్పులు చేపట్టింది రాజీవ్ గాంధీ అని అన్నారు. నాడు ఆయన చేపట్టిన సంస్కరణల కారణంగానే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయింది అన్నారు .పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగానే కాంగ్రెస్ పాలన కొనసాగేదన్నారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ ఏర్పడుతుందన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కార్యకర్తలు గట్టిగా కృషి చేయాలని రమేష్ ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బ్లాక్ అద్యక్షులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ , డివిజన్ అధ్యక్షులు ,బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్, యన్ యస్ యుఐ నాయకులు, మైనారిటీ నాయకులు, sc సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు ,సేవ్ దళ్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper