రాత్రి వేళల్లో ఏదేచ్ఛగా అక్రమంగా మట్టి తరలింపు

May 22, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 22 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ నియోజకవర్గంలో ట్రాక్టర్ల మరియు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్న మాఫియా పట్టించుకోని అధికారులుజోగులాంబ గద్వాల జిల్లా:గద్వాల మండలం, వెంకటోనిపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా యదేచ్చగా మట్టిని తరలిస్తూ కాసులు కురిపిస్తున్నారు. పగటి వేళల్లో మరియు రాత్రి వేళల్లో ట్రాక్టర్లు మరియు టిప్పర్లు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దండ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ప్రభుత్వ భూమిని కొల్లగొడుతూ అక్రమంగా మట్టిని తరలిస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనేది జోరుగా ప్రచారం సాగుతుంది. వెంకటోనిపల్లి గ్రామం నుంచి జమ్మిచెడు మేళచెరువు రోడ్డు నుంచి పిల్లిగుండ్ల మీదుగా మేళచెరువు రోడ్ సర్కిల్ లో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. మట్టి మాఫియా ట్రిప్పర్లు మరియు ట్రాక్టర్లు వేలకు వేల పట్టించుకోని అధికారులు ప్రభుత్వ భూమిని కొల్లగొడుతు కాసులు కురిపిస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నరనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

🌐 Select Language:
📰 ePaper