వైరల్ వార్తలు

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఏర్గట్ల మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

జనం న్యూస్, సెప్టెంబర్ 12: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం:నిజామాబాద్ నెక్సాన్ షోరూమ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదాన కార్యక్రమంలో జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సార్ చేతుల మీదుగా ఏర్గట్ల మండలానికి చెందిన కె. చక్రపాణి, సహాయక ఉపాధ్యాయులు (హిందీ), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తాడ్‌పాకల్, అలాగే బి. విజయకుమారి ఎస్ జి టి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తొర్తిలను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యా రంగంలో వారు చేస్తున్న విశేష సేవలను గుర్తించి ఈ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు శ్రీకాంత్, రమణ గుప్త, మధు యాదవ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు అంబెల్లి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్, ఏర్గట్ల మండల అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ ఉత్తమ ఉపాధ్యాయులు కె. చక్రపాణి, బి. విజయకుమారిలకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు అందుకోవడం ఏర్గట్ల మండలానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.

ఇ-పేపర్