జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల అరవపల్లి రైల్వే గేట్ సమీపంలో ఉన్న జయలక్ష్మి ఫ్యాన్సీ అండ్ ఎలక్ట్రిక్ దుకాణం శుక్రవారంషార్ట్,సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది తెల్లవారుజామున 4:15 నిమిషాల నుండి 10 గంటల వరకు మంటలు చెలరేగుతూనే ఉన్నాయి, మంటల ను గమనించిన స్థానికులు అప్రమత్తమై నివాసాలనుండిబయటికి వచ్చి సురక్షితప్రాంతాలకు చేరుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టంజరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ పూర్తిగాదగ్ధంఅయిపోయింది. ఈప్రమాదంలో భారీనష్టంసంభవించినట్లు యజమానులు తెలిపారు. మంటల్లో కాలిపోతున్న దృశ్యం చూసి యజమానులు బాధతోసొమ్మసిల్లిపోయారు.శుక్రవారం రాత్రి సంఘ టన స్థలానికి చేరుకున్న తాసిల్దార్ ఎం సుజాత బాధిత కుటుంబానికి పరామర్శించి ప్రభుత్వం ద్వారా రావలసిన సహా యం అందజేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో రెవిన్యూ సిబ్బంది ఆర్ ఐ సుశీల్ కుమార్, వి ఆర్వో నవీన్ తదితరులు పాల్గొన్నారు.