సీఐ చంద్రశేఖర రావు
జనం న్యూస్, సెప్టెంబర్ 12,అచ్యుతాపురం : వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, పోలీసు ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని అచ్యుతాపురం సీఐ చంద్రశేఖర రావు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వినాయక మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్/పోలీస్ శాఖ ద్వారా ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, నాణ్యమైన విద్యుత్ వైరింగ్ ఉపయోగించాలని, ప్రమాదాల నివారణకు మండపాల వద్ద నీరు, ఇసుక బకెట్లు, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని,ఉత్సవాల్లో డీజేల వినియోగానికి ఎలాంటి అనుమతి లేదని,సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పరిమితికి లోబడి మాత్రమే సౌండ్ సిస్టమ్స్ వాడుకోవాలని,మండపాల వద్ద నిమజ్జన ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నిమజ్జనం సమయంలో కమిటీ సభ్యులు ట్రాన్స్ జెండర్స్ తోగాని అసభ్యకరమైన డ్యాన్సులు చేయించరాదని, మద్యం సేవించి సముద్రం లేదా నదిలోకి వెళ్ళరాదని,నవరాత్రి ఉత్సవాలను, ఊరేగింపులను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకొని పోలీసు వ్యవస్థకు సహకరించాలని కోరారు.