తెలంగాణ

జియో నెట్‌వర్క్ సమస్యపై ఈడిగోనిపల్లి గ్రామ ప్రజల విజ్ఞప్తి

జియో నెట్‌వర్క్ సమస్యపై ఈడిగోనిపల్లి గ్రామ ప్రజల విజ్ఞప్తి

జనం న్యూస్ 12 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఈడిగోనిపల్లి గ్రామ ప్రజలు జియో నెట్‌వర్క్ సమస్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మా గ్రామంలో 900 మందికి పైగా జియో సిమ్ వినియోగదారులు ఉన్నారు గత రెండు–మూడు సంవత్సరాలుగా గ్రామంలోని జియో కస్టమర్లు నెట్‌వర్క్ సమస్యపై ఎన్నిసార్లు జియో అధికారులు మేనేజర్లకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు సరైన స్పందన కనిపించలేదు.నెట్‌వర్క్ సరిగా లేకపోవడంతో కాల్స్, ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవడంలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా స్పందించాలి జియో అధికారులు మరియు సంబంధిత మేనేజర్లు వెంటనే స్పందించి ఈడిగోనిపల్లి గ్రామంలోని నెట్‌వర్క్ టవర్‌ను మెరుగుపరచి, నాణ్యమైన నెట్‌వర్క్ సేవలు అందించాలి లేకపోతే గ్రామంలోని జియో కస్టమర్లు జియో నుంచి పోర్ట్ అయి ఇతర నెట్‌వర్క్‌లకు మారే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.ఈ సమస్యపై ప్రారంభమైన మా గ్రామ ఉద్యమం భవిష్యత్తులో ఇతర గ్రామాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. జియో అధికారులు ఇకనైనా సమస్యను సీరియస్‌గా తీసుకుని, వెంటనే నెట్‌వర్క్ టవర్ ఇంప్రూవ్‌మెంట్ చేయాలని ఈడిగోనిపల్లి గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం. స్థలం: ఈడిగోనిపల్లి గ్రామం, అయిజ మండలం జోగులాంబ గద్వాల జిల్లా డిమాండ్: వెంటనే జియో నెట్‌వర్క్ టవర్‌ను మెరుగుపరచాలి మీడియా మిత్రులు కూడా మా బాధలకు స్పందించగలరు మనవి

ఇ-పేపర్