తెలంగాణ

పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ

పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ

జనం న్యూస్ సెప్టెంబర్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గాంధీనగరంలో ‘శ్రీ సంజీవ్ సేవా ఫౌండేషన్’ ఫౌండర్ అండ్ చైర్మన్ శిలపరశెట్టి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో, శిలపరశెట్టి సంజీవరావు, రమణమ్మ దంపతుల సమక్షంలో శ్రీ సంజీవ్ సేవా ఫౌండేషన్’ సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. అలాగే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రజలకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలను పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయనకు ఫౌండేషన్ నిర్వాహకులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికీ శాలువా కప్పి ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహకరించారు . అనంతరం రాంకీ చేతుల మీదుగా ‘శ్రీ సంజీవ్ సేవా ఫౌండేషన్’ లోగోను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు .అలాగే సేవా దృక్పథంతో ముందుకొచ్చిన ఫౌండేషన్ ప్రతినిధులను, శిలపరశెట్టి సంజీవరావు, రమణమ్మ దంపతులను ఆయన చేతులు మీదుగా శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు బహుకరించి అభినందించారు. అనంతరం కమిటీ సభ్యులతో కలిసి స్థానిక ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలు, పూజా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ మాట్లాడుతూ ​”శ్రీ సంజీవ్ సేవా ఫౌండేషన్ పేరుతో యువత అంతా కలిసి సమాజ సేవ కోసం ఒక వేదికగా ఏర్పడటం ఎంతో అభినందనీయం. నేడు పర్యావరణ పరిరక్షణ అత్యంత ఆవశ్యకం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాల వల్ల జలవనరులు కలుషితమవుతున్న తరుణంలో, మట్టి గణపతులను పూజించాలనే స్పృహను ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా మంచి పరిణామం. భవిష్యత్తులో ఈ సంస్థ ద్వారా రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు సహాయం వంటి మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి అనకాపల్లి ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ​అలాగే శ్రీ సంజీవ్ సేవా ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ శిలపరశెట్టి ప్రసాద్ బాబు, కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజానికి ఏదో ఒక మేలు చేయాలనే సంకల్పంతో శ్రీ సంజీవ్ సేవా ఫౌండేషన్‌ను స్థాపించామని తెలిపారు. అలాగే మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందుకే మా తొలి అడుగుగా వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను, పూజా విధానం తెలిపే వ్రతకల్ప పుస్తకాలను ఉచితంగా అందించామని తెలియజేశారు. అదే విధంగా రాబోయే రోజుల్లో విద్య, వైద్యం, పర్యావరణ రంగాల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంజీవ్ సేవా ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ గోపిశెట్టి రామ్మూర్తి , అధ్యక్షులు ఇసరపు రమేష్, కార్యదర్శి గల్లా మహేష్, ఉపాధ్యక్షులు అల్తి శ్రీనివాస్, సరగడం విజయ్ బాబు, సంయుక్త కార్యదర్శులు సూరిశెట్టి శ్రీనివాస్, రెడ్డి జగన్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొణతాల శివాజీ, కోశాధికారి ఉసిరికల శ్రీనివాసు, ముఖ్య సలహాదారులు మళ్ల భాస్కర్, ద్రాక్షారపు రామచంద్రరావు, గంటా శ్రీనివాసరావుతో పాటు స్థానికులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇ-పేపర్