తెలంగాణ

వినాయక చవితి సందర్భంగా హైదర్‌నగర్‌లో ఘనంగా బ్యాడ్మింటన్ పోటీలు.

వినాయక చవితి సందర్భంగా హైదర్‌నగర్‌లో ఘనంగా బ్యాడ్మింటన్ పోటీలు.

హోరాహోరీ పోరులో చందు నరహరి విజేత

జనం న్యూస్: సెప్టెంబర్ 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి హైదర్‌నగర్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదర్‌నగర్ డివిజన్‌లోని ఎస్‌ఎల్‌వీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీలో శనివారం బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో సాగిన ఈ క్రీడా పోటీల్లో స్థానిక క్రీడాకారులు, అకాడమీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. ముఖ్యంగా ఫైనల్ పోటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చివరి పాయింట్ వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన హోరాహోరీ పోరులో చందు నరహరి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి విజేతగా నిలిచారు. విజేతగా నిలిచిన చందు నరహరికి నిర్వాహకులు ప్రథమ బహుమతితో పాటు జ్ఞాపికను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. పండుగల సందర్భంగా ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా యువతలో స్నేహభావం, ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో క్రీడా ప్రోత్సాహకులు విష్ణు యాదవ్, డాక్టర్ సురేందర్, అజయ్ చింతల, రామ్, నవీన్, ప్రవీణ్, ఆర్కే, సుధాకర్, సాయి, నరేష్, రమేష్, నాగరాజు యాదవ్, సురేంద్ర, దరియా, కిషోర్, బ్రహ్మ రెడ్డి తదితరులు పాల్గొని విజేత చందు నరహరికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇ-పేపర్