తెలంగాణ

జాతీయ బాలసాహిత్య పురస్కారం అందుకున్న ఎడ్ల లక్ష్మి

జాతీయ బాలసాహిత్య పురస్కారం అందుకున్న ఎడ్ల లక్ష్మి
జనం న్యూస్ ; 12 సెప్టెంబర్ శనివారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ : బాల సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నందుకు గాను సిద్దిపేటకు చెందిన ఎడ్ల లక్ష్మి జాతీయ బాల సాహిత్య పురస్కారం సిరిసిల్లలో అందుకున్నారు. రంగినేని ట్రస్ట్ నిర్వహిస్తున్న పిల్లల పండుగలో భాగంగా సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో సిద్దిపేటకు చెందిన ఎడ్ల లక్ష్మి జాతీయ బాలసాహిత్య పురస్కారం అందుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ పత్తిపాక మోహన్, గరిపల్లి అశోక్  సిద్దిపేట బాలసాహితీవేత్తలు ఉండ్రాళ్ళ రాజేశం, ఎన్నవెళ్ళి రాజమౌళి, వరుకోలు లక్ష్మయ్య, కోణం పరశురాములు పెందోట వెంకటేశ్వర్లు, మిట్టపల్లి పరశురాములు, ఎడ్ల భూంరెడ్డి,  కాల్వ రాజయ్య, జెగ్గారి నిర్మల, మచ్చ అనురాధ  తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్