జనం న్యూస్ సెప్టెంబర్ 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట . మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామశాఖ అధ్యక్షులు అంబరగొండ రాజేశ్వర్ రావు భార్య కీ||శే|| స్వప్న అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న శాయంపేట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి వారి నివాసానికి వెళ్లి వారి పార్థివదేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. వారి వెంట సీనియర్ నాయకులు మారపెల్లి నందం, గోవిందా పురం గ్రామ సర్పంచ్ స్వాతి దాసి శ్రావణ్ కుమార్, గాదె రాజేందర్, చెన్నబోయిన అజయ్ కుమార్, నర్ర రాజు, తదితరులు పాల్గొన్నారు..