ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల పై ఫీజు నియంత్ర చట్టాన్ని అమలు చేయాలి
జనం న్యూస్ 22 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా డిస్టిక్ డైరెక్టర్ దానమ్మ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు గద్వాల్ జిల్లా అధ్యక్షుడు హరీష్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ విద్యాసంస్థల లో విద్యార్థి తల్లిదండ్రులతో విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేసే పరిస్థితి కొనసాగుతుందనీ అన్నారు. మెజారిటీగా ఆయా ప్రైవేటు విద్యాసంస్థలలో పేద బడుగు బలహీన వర్గాలు మాత్రమే చదువుకునే ఆకాశం ఉంటుందనీ అయినప్పటికీ ముందుగా ప్రైవేట్ యజమాన్యులు అబద్ధపూ ప్రచారాన్ని నిర్వహిస్తూ విద్యార్థులను ముందుగా అడ్మిషన్ చేయించుకొని తర్వాతకి ముక్కు పిండి మరి ఫీజులను వసూలు చేసుకునే పరిస్థితి కొనసాగుతుంది అని అన్నారు.ఒకపక్క విద్య రంగాన్ని బలోపేతం చేస్తానన్ని ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి విద్య రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేయడంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పడిపోయే స్థితికి చేరుకుందని మండిపడ్డారు. ఒకపక్క ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడుకోవడం కోసం చర్యలు తీసుకోకపోవడమే కాకుండా ప్రవేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి వారికి సూత్రధారులుగా నిలిచే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడమే సిగ్గుచేటు అని అన్నారు పర్మిషన్ లేకుండా కొనసాగుతున్న ప్రవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అలాగే వారికి ప్రత్యేకంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు పరచాలని వారు అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం తగిన చర్యలు ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు హరీష్ శ్రీ కాంతు, వివేకు పాల్గొన్నారు.