తెలంగాణ

కూకట్‌పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

కూకట్‌పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ వవిమోచన దినోత్సవం (ప్రజా పాలనా దినోత్సవం) పురస్కరించుకుని కె.పి.హెచ్.బికాలనీ 5 వ ఫేస్ కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటెస్టేడ్ ఎం.ఎల్ . ఏ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జాతీయ జెండాను ఎగరవేసి, దానికి సగౌరవంగా వందనం సమర్పించారు.తెలంగాణ విమోచన మరియు విలీన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుని, వారికి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ప్రేమకుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల స్వేచ్ఛ, సమానత్వం అత్యంత కీలకమైనవని, అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మరియు స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇ-పేపర్