తెలంగాణ

మోదీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

మోదీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

జనం న్యూస్, సెప్టెంబర్ 17, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: యామపూర్ గ్రామం లొ ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే విధంగా పుస్తకాలను అందజేశారు.అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యత, విద్యార్థుల్లో సామాజిక బాధ్యత వంటి అంశాలపై కార్యక్రమంలో పాల్గొన్న వారు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగేష్, పాఠశాల హెచ్‌ఎం ముకుందా మేడం, అక్కపెల్లి జలంధర్, ఐజీ గంగా రెడ్డి, వీడీసీ సభ్యులు చింతకుంట సుధాకర్, పాఠశాల విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్