బిచ్కుంద సెప్టెంబర్ 17 జనం న్యూస్ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బిచ్కుంద తహసీల్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను తహసీల్దార్ వేణుగోపాల్ ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజా పాలనే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన పాలన అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, అధికారులు, సిబ్బంది అందరూ బాధ్యతతో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీటీ భాస్కర్ . చంద్రశేఖర్ కుశాల్ రెవెన్యూ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.