నందలూరు (జనం న్యూస్ )ప్రతినిధి) సెప్టెంబర్ 17 నందలూరు ఈరోజు అనగా 16.09.2026 న ఉదయము 11.00 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం,నంద లూరు నందు మండల పరిషత్ ప్రాదేశికనియోజకవర్గ(MPTC) /ZPTC 2026 ఎన్నికలకు సంబందించి పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా పరిశీలన కొరకు ప్రజా ప్రతినిదులతో సమావేశం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన జరిగింది.రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రాబోయే MPTC/ZPTC 2026 ఎన్నికల నిమిత్తం పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను ఎంపీడీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం మరియు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రజల పరిశీలనార్థం ఉంచినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సభకు వివరించారు.తదుపరి ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాను వివిధ రాజకీయ పార్టీ లకు చెందిన ప్రజా ప్రతి నిధులు పరిశీలించడ మైనది కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కే.ఆర్.ఎం ప్రసాద్ డిప్యూటీ ఎంపీడీఓస్ మాల్యద్రిగా ఏ డి హాబీబుల్లా ఖాన్ మరియు వివిధ రాజ కీయ పార్టీ లకు చెందిన ప్రతి నిధులు పాల్గొన్నారు