తెలంగాణ

నందికొండ మున్సిపాలిటీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

నందికొండ మున్సిపాలిటీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ – స్వర్ణ మానససుమన్

జనం న్యూస్- సెప్టెంబర్ 17- నాగార్జునసాగర్ టౌన్- సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నందికొండ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ స్వర్ణ మానససుమన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రజా పాలన స్ఫూర్తితో పట్టణ అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరేలా యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు. నందికొండ మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను అధికారులను ప్రత్యేకంగా ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ కౌన్సిలర్ లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్