ఆంధ్రప్రదేశ్

డీజే వాహనం సీజ్ – కేసు నమోదు

డీజే వాహనం సీజ్ – కేసు నమోదు

జనం న్యూస్ సెప్టెంబర్ 23 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామంలో అనుమతి లేకుండా డీజే సౌండ్, తీసుకువచ్చిన డీజే వాహనాన్ని బీబీపేట్ ఎస్సై కే. నవీన్ చంద్ర, ఆధ్వర్యంలో పోలీసులు సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఎస్సై కే. నవీన్ చంద్ర, మాట్లాడుతూ డీజే సౌండ్‌లకు ఎలాంటి అనుమతి లేదని అనుమతి లేకుండా డీజే వాహనాలను తీసుకురావడం, వినియోగించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని సూచించారు.

ఇ-పేపర్