ఆంధ్రప్రదేశ్

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో నరసింహారెడ్డిని పరామర్శించిన చిట్టెంపల్లి బాలరాజు

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో నరసింహారెడ్డిని పరామర్శించిన చిట్టెంపల్లి బాలరాజు

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 25. 09. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలోని ఏరియా ఆసుపత్రిని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజు సందర్శించారు. ఈ సందర్భంగా మాణిక్ ప్రభు మహిళలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నరసింహారెడ్డిని ఆయన పరామర్శించారు. ఆసుపత్రిలో నరసింహారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న బాలరాజు, వైద్యులతో మాట్లాడి అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని కోరారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సమయంలో అండగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. నరసింహారెడ్డి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వెళ్లాలని ఆకాంక్షించారు.

ఇ-పేపర్