ఆంధ్రప్రదేశ్

బిచ్కుంద మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

బిచ్కుంద మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

బిచ్కుంద సెప్టెంబర్ 25 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మున్సిపల్ లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు గురువారం పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం కార్మికుడు లక్ష్మణ్ మాట్లాడుతూ. మూడు నెలల నుంచి అధికారులు వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచి ప్రతి నెలా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చైర్ పర్సన్ సీమా షెట్కార్ స్పందించి కార్మికులతో మాట్లాడారు. ఒక నెల వేతనం అందజేస్తామని, కొద్ది రోజులు సమయం ఇస్తే బల్దియాకు పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి వేతనాలు పెంచుతామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నా విరమించి విధుల్లో చేరారు.

ఇ-పేపర్